ఐపీఎల్ 17వ సీజన్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్లే బంతులు వేస్తూ.. బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తిస్తున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్. అత్యంత వేగవంతమైన బంతులను విసురుతూ దడ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలో తన రికార్డు తనే బద్దలు కొట్టాడు ఈ లక్నో పేసర్. దీంతో అతని బౌలింగ్ పై మాజీ క్రికెటర్లు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 155.8 కి.మీ వేగంతో బంతి విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచాడు మాయంక్. ఇక, ఏప్రిల్ 3వ తేదీ మంగళవారం ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ తన బౌలింగ్ తో విరుచుకుపడ్డాడు. ఈక్రమంలో తను నెలకొల్పిన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్ లో గంటకు156.7కిమీ వేగంతో బంతిని విసిరాడు. దీంతో ఐపిఎల్ చరిత్రలో 156కిమీ వేగంతో బంతులు వేసిన రెండో భారత పేసర్ గా మయాంక్ యాదవ్ నిలిచాడు. అతనికంటే ముందు.. సన్ రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 5వ బౌలర్ గా ఉన్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తో తొలుత గ్లెన్ మాక్స్‌వెల్ ను ఔట్ చేసిన మయాంక్.. తర్వాత కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్ ల వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా గ్రీన్ ను వేగవంతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మయాంక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు.
కాగా, ఈ సీజన్ లో వేగంగా బంతులు వేయడంతోపాటు లైన్ అండ్ లెంగ్త్ తో బ్యాట్స్ మెన్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వరుసగా రెండోసారి 3 వికెట్లు తీసి.. ఈ సీజన్‌లో మూడో అత్యుత్తమ బౌలింగ్‌ను నమోదు చేశాడు మయాంక్.
𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 2, 2024
Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim