బంగ్లాతో టీ20లకు నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌

బంగ్లాతో టీ20లకు నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌

న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి మరోసారి టీమిండియాలోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌‌‌‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌‌కు శనివారం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌‌ కు  సూర్యకుమార్‌‌‌‌ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన టీమ్‌‌‌‌ను ఎంపిక చేశారు.  గతంలో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన నితీశ్‌‌ గాయంతో టీమ్‌‌‌‌ నుంచి వైదొలిగాడు. 

బంగ్లాతో సిరీస్‌‌కు హార్దిక్‌‌‌‌ పాండ్యా, రింకూ సింగ్‌‌‌‌ను కొనసాగించగా, వికెట్‌‌‌‌ కీపర్లుగా సంజు శాంసన్‌‌‌‌, జితేష్‌‌‌‌ శర్మకు చాన్స్‌‌‌‌ ఇచ్చారు. ఇక ఐపీఎల్‌‌‌‌లో 150 కిలో మీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌‌‌‌తో బౌలింగ్ చేసిన మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌కు తొలిసారి పిలుపు అందింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేండ్ల తర్వాత నేషనల్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు. అక్టోబర్‌‌‌‌ 6, 9, 12న వరుసగా గ్వాలియర్‌‌‌‌, ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి.  

జట్టు: సూర్యకుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, శాంసన్‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌, పాండ్యా, పరాగ్‌‌‌‌, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, శివం దూబే, సుందర్‌‌‌‌, బిష్ణోయ్‌‌‌‌, వరుణ్‌‌‌‌ చక్రవర్తి, జితేష్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, హర్షిత్‌‌‌‌ రాణా, మయాంక్‌‌‌‌ యాదవ్‌‌‌‌.