
ఐపీఎల్ 2025 లో వరుస విజయాలు సాధిస్తున్న లక్నో సూపర్ జయింట్స్ కు గుడ్ న్యూస్. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా పూర్తిగా కోలుకున్నాడు. అతను ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. తొలి ఆరు మ్యాచ్ లకు దూరంగా ఉన్న మయాంక్ మంగళవారం (ఏప్రిల్ 15) లక్నో జట్టులో చేరనున్నాడు. శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ రూ. 11 కోట్ల యువ బౌలర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మయాంక్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే తుది నిర్ణయం ఎల్‌ఎస్‌జి కోచింగ్ సిబ్బందిపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ కు ముందు నడుం గాయంతో ఇబ్బంది పడిన మయాంక్.. ఏప్రిల్ రెండవ వారం నాటికి కోలుకుంటాడని భావించినా అతని రాక మరింత ఆలస్యమైంది. లక్నో సోమవారం (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడనుంది. లక్నోలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మయాంక్ దూరమైనా శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ ఆడడం దాదాపుగా ఖాయమైంది. పంత్ సారధ్యంలోని లక్నో ఇప్పటివరకు ఆరు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించింది.
గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన మయాంక్ యాదవ్ ని మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ 11 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. మయాంక్ లేకపోవడంతో లక్నోకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అతని లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. మయాంక్ రాకతో లక్నో మరింత పటిష్టంగా మారనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో మయాంక్ యాదవ్ లక్నో తరపున నాలుగు మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ఒకసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
ALSO READ : DC vs MI: అక్షర్ పటేల్‌కు బ్యాడ్ న్యూస్.. ఓటమితో పాటు భారీ జరిమానా!
రెండేళ్ల కిందటే మయాంక్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 మెగా వేలంలో లక్నో అతన్ని రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో అతనికి ఒక్క అవకాశమూ రాలేదు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముంది గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలా అని లక్నో అతన్ని వదులుకోలేదు. అతనిపై నమ్మకం ఉంది అవకాశం ఉంది. దాన్ని మయాంక్ ఒడిసి పట్టుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటి తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఈ యువ ఫాస్ట్ బౌలర్ పై చాలా అంచనాలు ఉన్నాయి
🚨 GOOD NEWS FOR LUCKNOW 🚨
— Johns. (@CricCrazyJohns) April 14, 2025
- Mayank Yadav is likely to join the LSG squad tomorrow. [Sports Tak] pic.twitter.com/iPfRqP1ahb