Mayavathi nephew: బీఎస్పీ నుంచి మాయవతి మేనల్లుడు ఔట్

Mayavathi nephew: బీఎస్పీ నుంచి మాయవతి మేనల్లుడు ఔట్

బీఎస్పీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాలకోసమే ఆకాష్ ను పార్టీనుంచి తొలగిస్తున్నట్లు ప్రక టించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమం ప్రయోజనాలు, కాన్షీరామ్ క్రమశిక్షణ విధానం  ప్రకారం తన మామ అశోక్ సిద్దార్ధ్ మాదిరిగానే పార్టీ, ఉద్యమం ప్రయోజనాల దృష్ట్యా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. 

ఎందుకు ఆకాష్ ని తొలగించారు? 

ఆకాష్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్ ప్రభావం అతనిపై ఉందని.. జాతీయ సమన్వయ కర్తగా అన్ని బాధ్యతలను నుంచి ఆకాష్ ను తొలగిస్తున్నట్లు Xలో తెలిపారు మాయావతి. బహిష్కరణకు గురైనందుకు ప్రశ్చాత్తాపం చూపించాలని అన్నారు.  

గత నెలలో ఆకాష్ మామ అయిన అశోక్ సిద్దార్థ్ను పార్టీని నుంచి బహిష్కరించారు మాయావతి.ఆకాష్ సిద్ధార్థ్ దేశవ్యాప్తంగా పార్టీని రెండు వర్గాలు విభజించారని ఆరోపణలు ఉన్నాయి. అశోక్ ప్రభావం ఆకాష్ చాలా ఉంది. అందుకే పార్టీని బహిష్కరించామని ఆమె చెప్పారు. 

Also Read :- ఫోర్జరీ సంతకంతో రూ. 40 కోట్ల కాంట్రాక్ట్

పార్టీ నుంచి బహిష్కరణ జరిగిన తర్వాత ఆకాష్ మాట్లాడుతూ.. తాను ఎటువంటి ఆందోళన చెందడం లేదు.. బహుజన ఉద్యమ ఆదర్శాలే నాకు బలం.. తాను ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోరాటం ఒక కెరీర్ కాదని..అణగారిన వర్గాల ఆత్మగౌరవం ,ఆత్మగౌరవం కోసం పోరాటం అని ఆకాష్ అన్నారు.

‘‘మాయావతి నాయకత్వంలో త్యాగం, విధేయత ,అంకితభావం నేర్చుకున్నాను.. ఈ సూత్రాలను కేవలం ఒక ఆలోచనగా కాకుండా జీవన విధానంగా పరిగణించానని’’ ఆకాష్ ఆనంద్ అన్నారు. మాయావతి తీసుకునే ప్రతి నిర్ణయం కట్టుబడి ఉంటుందని, వారు ప్రతిదానిని గౌరవిస్తారని  దానికి అండగా నిలుస్తారని కూడా ఆకాష్ Xలో పోస్ట్ చేశారు.