
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని చెప్పారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. అనాడు మండల్ కమిషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని చెప్పారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని అన్నారు. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పైనా రాష్ట్ర ప్రభుత్వం FIR లు నమోదు చేయించిందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో బీఎస్పీ పార్టీ నిర్వహించిన సభలో మాయావతి మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేశామని చెప్పారు మాయావతి. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తరువాత భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓట్లు వేసి బీఎస్పీ పార్టీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.