లోక్ సభ ఎన్నికల వేళ బీఎస్పీ చీఫ్ మాయవతి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కూటమి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం నడుస్తుందని ఫైరయ్యారు. వార్తలలో కూడా అదే వస్తుందని.. మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదని సూచించారు.
బహుజనుల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయం తీసుకుందని మాయావతి తెలిపారు. యూపీలో బీజేపీకి ఎంతో బలం ఉందని. అందుకే ప్రత్యర్థి పార్టీలు ప్రజలను గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుందని ఈ డెసిషన్ మారదని మాయావతి స్పష్టం చేశారు.