కార్మికులకు మేడే గొప్ప పండుగ అని చెప్పారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. 1923లో 8 గంటల పనిదినం కోసం కార్మికులు ఉద్యమించి ప్రాణత్యాగం చేశారని చెప్పారు. గోదావరిఖనిలో లక్ష్మీ నగర్ లోని వీరాంజనేయ హమాలి సహకార సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రజెండను ఎగురవేసి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు ఎమ్మెల్యే వివేక్ . సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాన్ని తెచ్చి లక్ష మంది కార్మికులను కాకా వెంకటస్వామి కాపాడారని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విదంగా పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చారని గుర్తుచేశారు. కార్మికుల కోసం కాకా తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కార్మికుల భద్రత కోసం లేబర్ యూనియన్ స్థాపించారని తెలిపారు. మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఐ పవర్ కమిటీ వేతనాలు అమలు చేపిస్తామన్న చెప్పిన ఆయన.. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.