హైదరాబాద్ సిటీ, వెలుగు: రహ్మత్నగర్సర్కిల్ కమలానగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూములు ఇచ్చినా ఇంతవరకు ఇండ్లు కేటాయించలేదని స్థానికులు వాపోయారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో మేయర్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు.146 మంది స్థలాలు ఇస్తే.. 102 మందికి మాత్రమే డబుల్ ఇండ్లు కేటాయించారని 44 మందికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. స్పందించిన మేయర్వారంలో డబుల్ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బల్దియా హెడ్ఆఫీసుతోపాటు జోనల్ఆఫీసులకు కలిపి మొత్తం115 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో హెడ్డాఫీసుకు 35 వచ్చాయి.
సెల్ ఫోన్కు నో ఎంట్రీ.. కొత్త రూల్
జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ప్రజావాణికి వచ్చేవారు సెల్ఫోన్ బయట డిపాజిట్చేయాలని కొత్త రూల్పెట్టారు. సోమవారం ఫోన్లను డిపాజిట్చేయించుకున్నాకే లోపలికి అనుమతించారు. స్పెషల్గా ఓ టెంట్ వేసి కౌంటర్ ఏర్పాటు చేశారు. కొందరు లోపల ఆందోళనకు దిగి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్మీడియాలో పెడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.