- లక్షణాలు లేకుండా వ్యాధి
హైదరాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా సోకింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ర్యాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. కుటుంబసభ్యులకు నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు సార్లు టెస్టులు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. ఇప్పుడు మూడోసారికి పాజిటివ్ అని తేలింది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తానని మేయర్ ప్రకటించారు.