మంత్రి కేటీఆర్ ఆదేశాలతో గ్రేటర్ సిటీలో…. పారిశుధ్య పనులను పరిశీలిస్తున్నారు బల్దియా అధికారులు. సికింద్రాబాద్ జోనల్ పరిధిలో దోమల నివారణ కార్యక్రమంలో పాల్గొన్నారు జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ రవికుమార్. డెంగ్యూ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి దోమల మందును స్ప్రే చేస్తున్నారు. దోమలపై అవగాహన కల్పిస్తున్నారు. దోమల నివారణపై స్వచ్చ ఆటోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మరోవైపు లాలాపేట్ వినోబా నగర్ లో పర్యటించారు మేయర్ బొంతు రామ్మోహన్. డెంగ్యూ, మలేరియా పాజిటివ్ కేసులు నమోదైన ఇళ్లను గుర్తించి…. ఆయా ప్రాంతాల్లో లార్వా నివారణ మందును చల్లుతున్నారు. చుట్టుపక్కల 50 మీటర్ల వరకు ఉన్న ఇళ్లలో ముందు జాగ్రత్తగా దోమల మందును స్ప్రే చేస్తున్నారు. దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.