ఉప్పల్, బోరబండలో కొత్త లైట్‌హౌస్ సెంటర్లు

ఉప్పల్, బోరబండలో కొత్త లైట్‌హౌస్ సెంటర్లు
  • ఏర్పాటు చేస్తామన్న మేయర్​ గద్వాల విజయలక్ష్మి 
  • మల్లేపల్లిలో లైట్​హౌస్ ​సెంటర్​ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: లైట్‌హౌస్ సెంటర్ల ద్వారా యువతలో స్కిల్స్​పెంచి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం బజార్​ఘాట్​లో ఏర్పాటు చేసిన మల్లేపల్లి లైట్‌హౌస్ సెంటర్ ను డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ.. చందానగర్‌లో ప్రారంభమైన లైట్‌హౌస్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు 1,300 మందికి పైగా స్కిల్స్​డెవలప్​చేసుకున్నారన్నారు. ఇందులో 500 మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సాధించారని, ఎంతోమంది స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారన్నారు.

 మల్లేపల్లి లైట్‌హౌస్ సెంటర్‌లో కెరీర్ గైడెన్స్, 50 గంటల పర్సనాలిటీ డెవలప్​మెంట్​ఫౌండేషన్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్ , ఐటీ అండ్​డిజిటల్ స్కిల్స్ కోసం ‘టెక్ హబ్’, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్, మేకప్ తరగతులు, ఆన్‌లైన్ లెర్నింగ్, కెరీర్ కౌన్సెలింగ్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఉప్పల్, బోరబండ వంటి ప్రాంతాల్లో త్వరలో కొత్త లైట్‌హౌస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.