సఫిల్​గూడ లేక్ పార్కును బాగు చేయాలి : మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి 

  • అధికారులను ఆదేశించిన మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి 

హైదరాబాద్, వెలుగు : సఫిల్ గూడ లేక్ పార్కులోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె బల్దియా కమిషనర్ ఆమ్రపాలితో  కలిసి లేక్ పార్కును పరిశీలించారు. కార్పొరేటర్ శ్రావణ్, కాలనీ వాసులు, వాకర్లు పలు సమస్యలను  మేయర్ దృష్టికి తెచ్చారు. చెరువులో మురుగు చేరుతోందని, గుర్రపు డెక్కతో దోమలు విజృంభిస్తున్నాయని వివరించారు.

తగు చర్యలు తీసుకోవాలని మేయర్​ఆదేశించారు. అనంతరం దీన్ దయాళ్ కాలనీలోని నాలాను పరిశీలించారు. వారి వెంట సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. అలాగే జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో డెంగ్యూ నియంత్రణపై కమిషనర్​ఆమ్రపాలి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.