వామ్మో అది చికెన్ సెంటరా? లేక పశువుల దొడ్డా...పాడుబడ్డ షెడ్డులో ఎటు చూసినా రక్తపు మడుగులు...అపరిశుభ్రంగా.. షెడ్డును చూస్తేనే వాంతులు వస్తాయి. గత కొన్ని నెలలుగా అనుమతి లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా చికెన్ సెంటర్ ను నడుపుతున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ మేయర గద్వాల విజయలక్ష్మీ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
అసలేం జరిగిందంటే.? హైదరాబాద్ లోని న్యూ మోతీ నగర్ లో ఏపీసీ చికెన్ సెంటర్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మీ సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి ఏపీసీ చికెన్ సెంటర్ ను పరిశీలించారు మేయర్. అనుమతి లేకుండా .. అపరిశుభ్రంగా, ఏ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చికెన్ సెంటర్ ను నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే చికెన్ సెంటర్ ను సీజ్ చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు మేయర్. రూల్స్ కు వ్యతిరేకంగా చికెన్ సెంటర్ ను నిర్వహిస్తుస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మెడికల్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్.