ఫుట్ పాత్పై జారిపడ్డ మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఫుట్ పాత్పై  జారిపడ్డ మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. పుట్ పాత్ పై నడుస్తుండగా ఒక్కసారిగా కాలు బెనికి కిందపడిపోయారు. వెంటనే పక్కన ఉన్న వాళ్లు ఆమెను పైకి లేపారు. స్వల్ప గాయమైనట్లు మేయర్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

అసలేం జరిగిందంటే.. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు సుందరీకరణ పనులు ప్రారంభోత్సవానికి  మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు  మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ హెర్బల్ గార్డెన్ లో చిల్డ్రన్ ప్లే పార్క్ ప్రారంభించారు.  పంజాగుట్ట ఫ్లై ఓవర్ సుందరీకరణ పనులు, నాగార్జున సర్కిల్, సోమాజిగూడ జంక్షన్ సుందరీకరణ పనులు ప్రారంభించారు.  పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభోత్సవానికి వెళ్తూ నడుస్తండగా ఒక్కసారిగా కింద పడిపోయారు. 

ALSO READ | కేసీఆర్ కు లీగల్ నోటీస్