హైదరాబాద్: విశ్వ నగరంగా హైదరాబాద్ మారిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గురువారం రాష్ట్రం ఆవర్భావ దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమర వీరులకు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ఈ ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పారిశ్రామిక హబ్ గా మారిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో నూతన రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో అనేక పనులను జీహెచ్ఎంసీ చేపట్టిందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్లుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...