GHMC ఉద్యోగులకు మేయర్ హెచ్చరిక

GHMC ఉద్యోగులకు మేయర్ హెచ్చరిక

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఉద్యోగులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి హెచ్చరించింది. వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. GHMC ఉద్యోగులు ఉదయం10:30 వరకు ఆఫీస్‌కు రావాలని, గ్రేస్ టైం మరో 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని ఆమె అన్నారు. ఎంప్లాయ్స్ మూడు రోజులు డ్యూటీకి ఆలస్యంగా వస్తే.. ఒక క్యాజువల్ లీవ్ కట్ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రతీ ఉద్యోగి ఫేస్ రికగ్నైజ్ పాయింట్‌లో అటెండెన్స్ వేసుకోవాలని ఆమె చెప్పారు. అన్ని శాఖల HoDలతో మేయర్ గద్వాల విజయలక్ష్మి బుధవారం సమావేశం అయ్యారు. ప్రతీ ఉద్యోగి అటెండెన్స్ మానిటర్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

Also Read:-ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..మీరేం చేస్తుండ్రు