గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బంది రావొద్దు: మేయర్ గద్వాల విజయలక్ష్మి

సరూర్ నగర్  మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన మేయర్ గద్వాల విజయ లక్ష్మి. గణేశ్ నిమ్మజనంలో  ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు. సెప్టెంబర్ 5న  అధికారులతో కలిసి  సరూర్ నగర్  మినీ ట్యాంక్ బండ్ దగ్గర గణేశ మహా నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. గణేశశ్ నవరాత్రి ఉత్సవాలు, మహానిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రశాంతంగా ముగిసేలా  చర్యలు తీసుకోవాలని సూచించారు. 

నిమజ్జనం జరిగే ప్రతి బేబీ పాండ్, చెరువును సందర్శించడం జరుగుతుందని, ప్రజల సూచనలు కూడా తెలుసుకుని ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు మేయర్.. సీఎం రేవంత్ రెడ్డి.. అన్ని శాఖల అధికారులతో   సమన్వయ  సమావేశం నిర్వహించారని తెలిపారు.  ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ లు  చెరువు గురించి మేయర్ కు పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు.