అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్పీడప్​ చేయాలి : మేయర్​ సుధారాణి

అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్పీడప్​ చేయాలి : మేయర్​ సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ   పనులను స్పీడప్​ చేయాలని బల్దియా మేయర్​ గుండు సుధారాణి ఇంజనీరింగ్ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం బల్దియా హెడ్ ఆఫీస్​లో ఇంజినీరింగ్​ ఆఫీసర్లతో మేయర్​ మాట్లాడుతూ అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ, అభివృద్ధి పనులకు రూ.4170కోట్లతో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.187కోట్లు నిధులు విడుదల అయ్యాయనితెలిపారు. 

అందుకు సీఎం రేవంత్​ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పట్టణ ప్రగతి జీఓ 65కు సంబంధించిన నిధులు విడుదల చేయక పోవడం వల్ల ఆ పనులు మధ్యలో నిలిచి పోయాయని , రాష్ర్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో.. వాటిని పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, ఈ ఈ లు మహేందర్, శ్రీనివాస్, సంతోష్ బాబు, డి ఈలు సారంగం, కార్తీక్ రెడ్డి, రవికిరణ్, రాజ్ కుమార్, ఏఈలు, డిబిలు తదితరులు పాల్గొన్నారు.