
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్వరంగల్అంటే ఇట్లనే ఉంటదా అంటూ బల్దియా ఆఫీసర్లను బల్దియా మేయర్ గుండు సుధారాణి ప్రశ్నించారు. ఆదివారం 29వ డివిజన్లో ఆమె పర్యటిస్తుండగా ఎక్కడా పడితే అక్కడే చెత్తా చెదారంతో ఉండడంతో బల్దియా శానిటేషన్ తీరుపై అసృంప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న శానిటేషన్ డ్రైన్ సీసీ రోడ్ల ఏర్పాటు తదితర సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకొని, పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. మేయర్ వెంట సునూరి చందర్, పాకాల సాంబయ్య, దేవరకొండ కృష్ణ, అప్పరాజు, లక్ష్మి, పద్మ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.