ఉప్పల్​లో మోడల్​గ్రేవ్ యార్డుకు శంకుస్థాపన

ఉప్పల్​లో మోడల్​గ్రేవ్ యార్డుకు శంకుస్థాపన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ఫోకస్ పెట్టినట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్​లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మోడల్ గ్రేవ్ యార్డుకు మంగళవారం ఆమె డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్​మాట్లాడుతూ.. స్థానిక పిస్తా హౌస్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు ఖాళీ స్థలంలో పార్కును డెవలప్​చేయాలని అధికారులను ఆదేశించారు. 

బ్యాంక్​కాలనీలో ఓపెన్ డ్రైనేజీ స్థానంలో బాక్స్ డ్రెయిన్​నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ కోరగా, నివేదిక పంపాలని జోనల్ ఎస్ఈని మేయర్ సూచించారు. నాచారం చెరువు మత్తడి నుంచి ఓవర్ ఫ్లోతో కాలనీలోకి నీరు చేరుతోందని, మల్లికార్జున్ నగర్ కాలనీవాసులు మేయర్ దృష్టికి తీసుకురాగా నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. 

అజాంపూర్ అలకాపురి నార్త్ కాలనీలో పార్క్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. మిస్టాట్ ఎన్ క్లేవ్ నాలా క్రాసింగ్ వద్ద ఎత్తయిన బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు మేయర్​ను కోరారు. ఇందిరా నగర్ కమ్యూనిటీ హాల్ స్థానంలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని మేయర్​హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.