
ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఉదయం బీఆర్‌ఎస్ జిల్లా ఆఫీస్‌లో జరిగిన మీటింగ్‌కు మేయర్ నీరజ హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్‌లో ప్రత్యక్షం అయ్యారు. మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్టు నీరజ చెప్పారు.