
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరం బీసీ కాలనీ నుంచి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ రోడ్డును సిటీ మేయర్ పూనుకొల్లు నీరజ మంగళవారం పరిశీలించారు.
ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు డ్యామేజ్ కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, ఈఈ కృష్ణలాల్, డీఈ మాధవి, ఏఈ నవ్య ఉన్నారు.