కరీంనగర్ టౌన్, వెలుగు: స్మార్ట్ సిటీ పనులపై అవాస్తవాలు మాట్లాడటం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తగదని, ఈ విషయంలో విజిలెన్స్, ఈడీ, సీబీఐ.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని మేయర్ యాదగిరి సునీల్ రావు సవాల్ చేశారు. మంగళవారం సిటీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతోనే కరీంనగర్ సిటీ అభివృద్ధి చెందిందని మేయర్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా కరీంనగర్ అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ఒక్క పైసా తీసుకురాలేదని విమర్శించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి 10 మంది డైరెక్టర్లు ఉంటారని, అందులో తానూ ఒక డైరెక్టర్‌ను మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 17 సార్లు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ జరిగిందని, డెరెక్టర్ల తీర్మానం మేరకే నిధుల్ని వినియోగిస్తామన్నారు.
స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడంలో సంజయ్ కృషి ఉన్నందుననే పాలకవర్గంతో కలిసి ఆయనను కలిసినట్లు చెప్పారు. మేయర్, కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా పొన్నం కరీంనగర్ కార్పొరేషన్‌పై రివ్యూ ఎలా నిర్వహిస్తారని మరోసారి ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు గంధె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, వాల రమణారావు, దిండిగాల మహేశ్, బోనాల శ్రీకాంత్, కంసాల శ్రీనివాస్, కచ్చు రవి, లీడర్లు
పాల్గొన్నారు.