కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీలో శనివారం మేయర్ సునీల్ రావు బర్త్ డే వేడుకలు జరిగాయి. భగత్ నగర్ హరిహర క్షేత్రంలోని అయ్యప్ప దేవాలయంలో సునీల్ రావు ప్రత్యేకపూజలు చేశారు. 33వ డివిజన్ లోని మేయర్ క్యాంప్ ఆఫీస్ లో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, చైతన్యయూత్, తెలంగాణ చౌక్ లో ఉయ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీకట్ చేశారు. పెద్దమ్మ యూత్, అయ్యప్పటెంపుల్, వెంకటేశ్వరటెంపుల్స్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్,కచ్చురవి,తిరుపతి,లీడర్లు ఎడ్ల అశోక్, అబ్బాస్ షమి తదితరులు పాల్గొన్నారు.