సంజయ్ ఎంపీ కాకముందే.. కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైంది : సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

కరీంనగర్ టౌన్, వెలుగు:  బండి సంజయ్ ఎంపీగా గెలవక ముందే కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైందని, దీనిపై ఎంపీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఫైర్అయ్యారు. గురువారం ఎస్బీఎస్ ఫంక్షన్  హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మీడియాతో ఆయన మాట్లాడుతూ సంజయ్ ​నాలుగేళ్లుగా కరీంనగర్ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని, సిటీ కోసం నయాపైసా తీసుకురాలేదన్నారు.

ఇప్పటివరకు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మార్ట్ సిటీ నిధులు రూ.539 కోట్లు వచ్చాయని, అందులో రూ.269.5కోట్ల చొప్పున  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  మంజూరు చేశాయన్నారు. 2017లో బల్దియా పాలకవర్గం అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిసి విన్నవిస్తే స్మార్ట్​సిటీ మంజూరైందని, ఆ టైంలో సంజయ్  ఎక్కడ  ఉన్నాడని  ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ది పనులను  ప్రారంభించేందుకు రెండుసార్లు ఫోన్  చేసినా ఆయన రాలేదని గుర్తు చేశారు.

స్మార్ట్ సిటీ బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని, అసత్య ఆరోపణలు చేయడం ఎంపీకి అలవాటేనన్నారు. సమావేశంలో  కార్పొరేటర్లు గంధె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ,  యాదయ్య, బుచ్చిరెడ్డి,  లీడర్లు సంపత్ రెడ్డి, అశోక్, మహేశ్ పాల్గొన్నారు.