కరీంనగర్ టౌన్, వెలుగు : రాష్ట్రంలోనే కరీంనగర్‌ను అందమైన సిటీగా తీర్చిదిద్దామని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. శుక్రవారం సిటీలోని 1, 14,18 డివిజన్లల్లో రూ.90 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీలో రూ.1300కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు.
విలీనగ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ప్రతి డివిజన్‌కు రూ.5కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం శాతవాహన వర్సిటీ ఎదురుగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలాసత్పతిని కలిసి నోట్ బుక్స్,పెన్నులు ఇచ్చి,శుభాకాంక్షలు తెలిపారు.