కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలోని అన్ని గల్లీలను అభివృద్ధి చేశామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గురువారం 52వ డివిజన్ ముకరంపుర ఏరియాలో రూ.78లక్షలతో చేపట్టనున్న ఎస్‌డబ్ల్యూజీ డ్రైనేజీ పైప్ లైన్, సీసీ ప్యాచ్ రోడ్డు పనులను మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల్లేని సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.
ఐదేండ్లలో రూ.వందల కోట్ల నిధులు తెచ్చి సిటీని సుందరంగా మార్చామన్నారు. అనంతరం హౌజింగ్ బోర్డులో కేంద్ర,రాష్ట్ర మంత్రులు పాల్గొనే సభాప్రాంగణాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, వాల రమణారావు, తదితరులు పాల్గొన్నారు.