కేసీఆర్‎కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‎కు పార్టీకి సునీల్ రావు రాజీనామా

కేసీఆర్‎కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‎కు పార్టీకి సునీల్ రావు రాజీనామా

కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎కు మరో బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్‎కు సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో శనివారం (జనవరి 25) బీజేపీలో  చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కరీంగనర్ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

ALSO READ | బనకచర్లకు అంగీకరించట్లేదని ఖరాఖండీగా చెప్పాం: మంత్రి ఉత్తమ్ కౌంటర్

స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్‎లో మధ్యాహ్నం 12:00 జాయినింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కాగా, సునీల్ రావు కరీంనగర్ బీఆర్ఎస్‎లో కీలక నేత. ప్రస్తుతం కరీంనగర్ మేయర్‎గా ఉన్న ఆయన కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. మరికొన్ని రోజుల్లో కరీంగనర్, నిజామాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో సునీల్ రావు పార్టీని వీడటం గులాబీ పార్టీకి ఎదురు దెబ్బేనని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.