కరీంనగర్ టౌన్, వెలుగు: ఓటమి భయంతోనే మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. మంగళవారం సిటీలో మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి మంత్రి గంగుల, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన నిధుల వివరాలను జీవోలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
సంజయ్ ఎంపీ కాకముందే కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైందని, సిటీ మీదుగా వెళ్లే రహదారిని తానే మంజూరు చేయించానని సంజయ్ చెప్పుకోవడం దారుణమన్నారు. రోడ్ ట్యాక్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటా కింద ఆర్వోబీకి నిధులు మంజూరయ్యాయన్నారు. సిటీ అభివృద్ధికి సంజయ్ కేంద్రం నుంచి ఒక్క పైసా తేలేదని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.
బండి యువతకు క్షమాపణ చెప్పాలి
యువతకు గంజాయి అలవాటు చేసినట్లు, భూకబ్జా చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ పై చేసిన వ్యాఖ్యలు నిరూపించాలని, లేకపోతే యువతకు ఆయన క్షమాపణ చెప్పి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం రాంనగర్ మీకోసం ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. గంగులపై ఎంపీ బండి సంజయ్అసత్య ఆరోపణలు చేస్తే ఆయన ప్రచారాన్ని అడ్డుకుంటామన్నారు. ఓటుకు రూ.10వేలు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.