గంగుల కమలాకర్ కంట్రోల్‌‌‌‌లో ఉండాలె .. ఆరోపణలు చేస్తే అవినీతి చిట్టా విప్పుతా : మేయర్​ సునీల్ రావు

గంగుల కమలాకర్ కంట్రోల్‌‌‌‌లో ఉండాలె .. ఆరోపణలు చేస్తే అవినీతి  చిట్టా విప్పుతా : మేయర్​ సునీల్ రావు

కరీంనగర్, వెలుగు : ‘నేను మేయర్ అయితే రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతాననే ఉద్దేశంతో డమ్మీని పెట్టి రాజ్యమేలుదామనుకున్నరు.. కానీ కేసీఆర్, వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆశీర్వాదంతో నాకు మేయర్ పదవి వచ్చింది. గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌కు చెక్ పెట్టేందుకే నాకు మేయర్ పదవి ఇచ్చిన్రు’ అని కరీంనగర్‌‌‌‌ మేయర్‌‌‌‌ సునీల్‌‌‌‌రావు చెప్పారు. ఆయనతో పాటు కార్పొరేటర్లు లెక్కల స్వప్న వేణు, శ్రీదేవి చంద్రమౌళి శనివారం బీఆర్ఎస్‌‌‌‌ను వీడి బీజేపీలో చేరారు. 

కరీంనగర్‌‌‌‌లోని గోదాంగడ్డ ఎస్‌‌‌‌బీఎస్‌‌‌‌ ఫంక్షల్‌‌‌‌హాల్‌‌‌‌లో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్‌‌‌‌రావు మాట్లాడుతూ.. ‘గంగుల కమలాకర్.. కంట్రోల్‌‌‌‌లో ఉండాలె, నాపై చిల్లర ఆరోపణలు చేస్తే అందరి చిట్టా విప్పుతా, మానేరు రివర్‌‌‌‌ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనుల్లో ఏం జరిగిందో నా వద్ద ఆధారాలు ఉన్నాయి’ అన్నారు.  

అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం సునీల్‌‌‌‌ రావు నైజం : ఎమ్మెల్యే గంగుల

‘మేయర్‌‌‌‌ సునీల్‌‌‌‌రావు స్వార్థపరుడు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తాడు, వెన్నుపోటు పొడవడం ఆయనకు అలవాటే’ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌ విమర్శించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లోకి వచ్చి దొడ్డి దారిన మేయర్‌‌‌‌ అయ్యారని, ఆయనకు పదవి ఇవ్వొద్దని ఆరోజే చెప్పామన్నారు. అవినీతి బయట పడకుండా, కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరుతున్నాడని విమర్శించారు.