స్ట్రీట్​ లైట్ల నిర్వహణ అధ్వానం.. అధికారులపై మేయర్ విజయలక్ష్మి సీరియస్

ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్​విజయలక్ష్మి గురువారం భోలక్​పూర్, బౌద్ధ నగర్ డివిజన్లలో పర్యటించారు. భోలక్​పూర్​లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై మండిపడ్డారు. విద్యుత్​తీగలపై చెట్ల కొమ్మలు తొలగించరా అని అధికారులను నిలదీశారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ సక్రమంగా లేదని, డ్రైనేజీ మ్యాన్​హోళ్ల మూతలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబర్ నగర్ నాలా చుట్టూ ప్రహరీ, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని మేయర్​తెలిపారు. కార్పొరేటర్ కంది శైలజతో కలిసి స్థానికులతో మాట్లాడారు. శానిటేషన్, స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఆరా తీశారు. ఆమె వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ గౌసోద్దీన్, ఉన్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో స్థానిక సమస్యలను కార్పొరేటర్ ప్రస్తావించగా, క్షేత్రస్థాయి పరిశీలినకు వచ్చినట్లు మేయర్​తెలిపారు.