హైదరాబాద్ లో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. చుట్టూ పెన్సింగ్ వేసి మకాం వేస్తున్నారు. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ పీఎస్ వెనకాల ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ నే కబ్జా చేశారు .
జూబ్లీహిల్స్ పీఎస్ వెనుకాల ఉన్న 2 వేల గజాల స్థలాన్ని జనవరి 20న మేయర్ గద్వాల విజయలక్ష్మీ సందర్శించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ ఎవరో వాల్ నిర్మించారు. జీహెచ్ఎంసీ పార్క్ ఆక్రమణకు గురైనట్టు గుర్తించిన మేయర్ సీరియస్ అయ్యారు. వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.