5 ఏళ్లలో జరిగిన పనులపై విచారణ చేయాలి : మేయర్ యాదగిరి సునీల్ రావు

5 ఏళ్లలో జరిగిన పనులపై విచారణ చేయాలి : మేయర్ యాదగిరి సునీల్ రావు
  • మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోద్బలంతోనే కరీంనగర్ సిటీలో  అవినీతి జరిగిందని మేయర్ యాదగిరి సునీల్‌‌‌‌రావు ఆరోపించారు. సోమవారం సిటీలోని ఓ ఫంక్షన్  హాల్‌‌‌‌లో మేయర్‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో సిటీతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అన్ని పనులపై  విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతోనే  కరీంనగర్ అభివృద్ధి చెందిందన్నారు. 

అభివృద్ధి పనుల కోసమని ప్రతిరోజూ వందల ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారని, ఇసుక క్వారీల నిర్వహణ పైనా విచారణ చేయించాలన్నారు. కరీంనగర్ అభివృద్ధి బండి సంజయ్,  ప్రధాని మోదీతోనే సాధ్యమని భావించి బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు రాపర్తి విజయ, కాసర్ల ఆనంద్, అనూప్, తాడెపు చంద్రమౌళి, లీడర్లు రమణారెడ్డి, సతీశ్‌‌‌‌, భాస్కర్, మొండయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.  

సీపీకి మేయర్ ఫిర్యాదు 

కరీంనగర్ క్రైం,వెలుగు: బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని మేయర్ యాదగిరి సునీల్ రావు సోమవారం సీపీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్‌‌‌‌కు చెందిన కార్పొరేటర్ రాజేందర్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, లీడర్లు నవాజ్ హుస్సేన్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియాలో తన ఫొటోలను మార్ఫింగ్‌‌‌‌ చేసి వీడియోలు, ఫొటోలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.