కరీంనగర్ టౌన్, వెలుగు: రాబోయే ఎంపీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని, బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని మేయర్ యాదగిరి సునీల్ రావు జోస్యం చెప్పారు. బుధవారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు.
సంజయ్‌ను సొంత పార్టీ నాయకులే ఓడించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. అనంతరం 27,36,53వ డివిజన్లలో ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. కార్పొరేటర్లు రమణారావు, నేతికుంట యాదయ్య, గుగ్గిళ్ల జయశ్రీ, గంధెమాధవి, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి పాల్గొన్నారు.