కరీంనగర్ టౌన్,వెలుగు : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్ రావ్ ఠాక్రే రైతు వ్యతిరేకులని మేయర్ యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు. శుక్రవారం సిటీలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేయడం వారికి రైతులపై ఉన్న కపట ప్రేమకు నిదర్శనమన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి రైతులకు 3గంటలే కరెంట్ సరిపోతుందని చెప్పాడని గుర్తుచేశారు.
కరీంనగర్నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు గందె మాధవి, సరిత, సతీశ్, జయశ్రీ, రమణరావు, వేణు,యాదయ్య, మాలతి రెడ్డి, శ్రీదేవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.