కరీంనగర్ టౌన్, వెలుగు : ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటపట్టించిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావును అవమానపరిచిన కాంగ్రెస్.. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మునిగిపోయే నావ లాంటిదని, ఆ పార్టీ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థులే లేరని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్13 సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు మాధవి, రమణారావు, యాదయ్య, మహేశ్, పాల్గొన్నారు.
నైతికంగా ఓటమిని ఒప్పుకున్నట్లే..
రాహుల్ గాంధీ కరీంనగర్‌లో పర్యటించి, కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదని, నైతికంగా ఆ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్లేనని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ అన్నారు. శుక్రవారం రామ్‌నగర్ లోని మీసేవ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.