కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలో మేయర్ యాదగిరి సునీల్ రావు బర్త్ డే సెలబ్రేషన్స్ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక మీసేవ ఆఫీస్ లో మంత్రి గంగుల కమలాకర్.. మేయర్‌తో కేక్ కట్‌చేయించారు. కేక్తినిపించి విషెష్చెప్పారు. అంతకుముందు తెలంగాణ చౌక్ లో భారీ కేక్ ను కట్ చేసి, స్వీట్లు తినిపించారు. మేయర్ క్యాంప్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, ఉమెన్స్ కాలేజీలో వాకర్స్ ఆధ్వర్యంలో, 33వ డివిజన్ యూత్, భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, టీఎన్జీవోలు, తిరుమల్ నగర్, సవరన్ స్ట్రీట్, పెద్దమ్మ దేవాలయం, లయన్స్ క్లబ్.. తదితర ఏరియాల్లో మేయర్బర్త్డే వేడుకలు నిర్వహించారు.
భగత్ నగర్‌లోని హరిహర కళా క్షేత్రంలో అన్నదానం నిర్వహించారు. కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో కాపువాడలో క్యాన్సర్ పేషెంట్లకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు శ్రీదేవి, జయశ్రీ, ప్రసాద్, శ్రీనివాస్, సత్యం, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.