కరీంనగర్ ను బ్యూటిఫుల్ సిటీగా తీర్చిదిద్దుకుందాం : సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ ను అందమైన నగరంగా తీర్చిదిద్దుకుందామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. బుధవారం 33వ డివిజన్ భగత్ నగర్ లోని హరిహర క్షేత్రంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్లవిజయతో కలిసి ఆయన ఆలయమండప పనులను ప్రారంభించారు. సిటీలో ఎలాంటి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.

అయ్యప్ప ఆలయ పనులను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భక్తులకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓ కాంతారెడ్డి, ఆర్చకులు మంగళంపల్లి రాజయ్యశర్మ, చాణక్యశర్మ, శ్రీనివాసశర్మ, మూర్త పాల్గొన్నారు.