ఖమ్మంలో మయూరి హాస్పిటల్ సీజ్

ఖమ్మం టౌన్,వెలుగు :  పర్మిషన్ లేకపోయినా అబార్షన్లు చేస్తున్న మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్​ చేసి, యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్​వో మాలతి తెలిపారు. ఖమ్మం నగరంలోని వినోద థియేటర్ వెనుకాల ఉన్న మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆదివారం డిప్యూటీ డీఎం హెచ్ వో బి.సైదులతో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అన్ని రకాల సర్జరీలకు  ఒక్కటే ఆపరేషన్ థియేటర్ నే వినియోగిస్తున్నారు. సరైన సౌకర్యాలు కూడా లేనందున ఆసుపత్రిని సీజ్ చేశారు.