సందీప్ కిషన్, రీతు వర్మపై మజాకా మూవీ రావులమ్మ సాంగ్ షూట్

సందీప్ కిషన్, రీతు వర్మపై మజాకా మూవీ రావులమ్మ సాంగ్ షూట్

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా  త్రినాధరావు నక్కిన  రూపొందించిన చిత్రం ‘మజాకా’.  రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషించారు. ఎకె ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌‌పై రాజేష్ దండా నిర్మించారు.  శివరాత్రి కానుకగా  ఫిబ్రవరి 26న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రమోషన్స్‌‌తో ఆడియెన్స్‌‌ని అలరించారు మేకర్స్.  సాంగ్‌‌ షూట్‌‌ను లైవ్ ఇచ్చి  ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించారు. ఈ  సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో  సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘క్రియేటివ్‌‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. ఇది ఫస్ట్  లైవ్ షూట్ ప్రెస్ మీట్ అని చెప్పడం సర్‌‌‌‌ప్రైజ్‌‌గా అనిపించింది. నెల రోజులుగా  డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. 

 పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.  అందరూ ఎంజాయ్  చేసేలా సినిమా ఉంటుందని రీతూ వర్మ అంది. దర్శకుడు  త్రినాధరావు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఇది సెకండ్ మాస్ సాంగ్. రావులమ్మ అంటూ సాగే ఈ  పాటను మూడు రోజులుగా  భారీ సెట్‌‌లో చిత్రీకరించాం. దాదాపు డెబ్బైమంది డ్యాన్సర్స్‌‌తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో షూట్ చేశాం. ఈసారి మళ్లీ సీట్లు లేస్తాయి.  సినిమా రీ రికార్డింగ్ చూశాను. ఎక్స్‌‌లెంట్‌‌గా ఉంది’ అని చెప్పాడు. నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్​ దండా, రైటర్ ప్రసన్న కుమార్ మరో హిట్ గ్యారెంటీ అన్నారు.