హైదరాబాద్ లో ఎంబిఏ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని దిల్ సుఖ్ నగర్ లో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లాకు చెందిన 26ఏళ్ల సాహితి దిల్ సుఖ్ నగర్ లోని లక్ష్మీ ఉమెన్స్ ప్రైవేటు హాస్టల్ ఉంటూ MBA చదువుతుంది.
ఈ క్రమంలో హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న చైతన్య పురి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం స్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.