హైదరాబాద్ బాయిస్ హాస్టల్ బాత్రూంలో పడి.. ఎంబీఎ స్టూడెంట్ మృతి

బషీరాబాద్ పోలీస్ సేష్టన్ పరిధిలో దారుణం జరిగింది.  మైసమ్మగూడ లోని ఓ హాస్టల్ బాత్రూంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..  కూశాల్(23) అనే యవకుడు స్థానికంగా ఓ ప్రవేటు కాలేజీలో ఎంబీఎ ఫస్టీయర్ చదువుతున్నాడు. 

గత కొద్దిరోజులుగా కూశాల్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 2023 జూలై 30 అర్థరాత్రి మూత్ర విసర్జనకని బాత్రుంకు వెళ్లాడు. అయితే గుండె  నొప్పి  ఎక్కువ కావడంతో భరించలేక అక్కడిక్కడే కూలిపోయి చనిపోయాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.