
కాశీబుగ్గ, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.
దరఖాస్తుల పరిశీలించిన తర్వాత మెరిట్ జాబితాను విడుదల చేస్తామని, ఆ తర్వాత వెబ్ ఆప్షన్లకు వర్సిటీ మరో ప్రకటన జారీ చేస్తుందని తెలిపారు. అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs,telangana.gov.inli చూడాలని కోరారు.