మెడికల్ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. దీనిపై ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019’ ముసాయిదా కేంద్రానికి అందింది. నర్సింగ్, డెంటల్ గ్రాడ్యుయేట్స్‌కు ఎంబీబీఎస్ కోర్సులో లేటరల్ ఎంట్రీ (వేరే కోర్సు చదివిన వారు చేరే చాన్స్) నర్సులకు
‘డాక్టర్’గా చాన్స్ ఉండాలని సూచించింది. ఇందుకోసం సైన్స్ స్టూడెంట్లందరికీ ఏడాది లేక రెండేళ్లు కామన్ కోర్సు ఉండాలని.. తర్వాత డెంటిస్ట్, నర్సింగ్, మెడిసిన్ స్పెషలైజేషన్ పెట్టాలని సూచించింది. లేటరల్ ఎంట్రీకి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని, నీట్ రాయాల్సిందేనని మెడికల్ ఎడ్యుకేషన్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్‌లో పాలు పంచుకున్న డాక్టర్ దేవి శెట్టి అన్నారు.
గ్రామీణ స్టూడెంట్లకు అందాలి
మెడిసిన్, నర్సింగ్, డెంటిస్ట్రీలోని రకరకాల కౌన్సిళ్లను వాటికి సంబంధించిన ప్రమాణాలు చూడటం, కాలేజీల్లో తనిఖీలు చేయడం, అక్రెడిటేషన్ ఇవ్వడం వరకు పరిమితం చేయాలని పాలసీ సూచించింది. ఫీజుల వ్యవస్థలోనూ మార్పులు తేలవాలని, వాటి నిర్ణయాధికారం ఇన్‌స్టిట్యూషన్లకే ఇవ్వాలని చెప్పింది. అయితే 50 శాతం మందికి కచ్చితంగా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో పాటు 20 శాతం మందికి పూర్తి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని పేర్కొంది. విద్యకయ్యే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామీణ స్టూడెంట్లకూ హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్ అందేలా చూడాలని చెప్పింది. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్‌కు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా ఉండాలని మరోసారి సూచించింది. ఎంబీబీఎస్ ఎగ్జిట్ ఎగ్జామ్‌ను పోస్టు గ్రాడ్యుయేషన్‌కు ఎంట్రీగా భావించాలంది. ఈ ఎగ్జామ్‌ను ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరంలో నిర్వహించాలని సూచించింది.
ఎడ్యుకేషన్, ప్రాక్టీస్‌ను వేరు చేయాలి
హెల్త్‌కేర్ రంగంలో ప్రొఫెషనల్స్ తక్కువగా ఉన్నారని, దీన్ని అధిగమించడానికి సూచనలిచ్చేందుకు గాను ప్రత్యేక కమిటీని నియమించాలని పాలసీ సూచించింది. హెల్త్‌కేర్ రంగంలో ఎక్కువ మంది స్టూడెంట్లకు కల్పించేందుకు దేశంలోని 600 జిల్లా హాస్పిటళ్లను టీచింగ్ హాస్పిటళ్లుగా అప్‌గ్రేడ్ చేయాలంది. పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లను కూడా పెంచాలని చెప్పింది. ప్రొఫెషనల్ ప్రాక్టీస్‌ను ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నుంచి వేరు చేయాలంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్, డెంటిస్ట్ కౌన్సిళ్లు ఆదర్శవంతమైన సిలబస్ ముసాయిదాను రూపొందించాలని, దాని ఆధారంగా ఇన్‌స్టిట్యూషన్లు తమ సిలబస్‌ను తయారు చేసుకుంటాయని వివరించింది. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న ప్రతి ఇన్‌స్టిట్యూషన్ ఐదేళ్లకోసారి కచ్చితంగా అక్రెడిటేషన్ తీసుకోవాలని చెప్పింది.