కరీంనగర్ టౌన్, వెలుగు: ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలు రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించుకోవాలని ప్రజామిత్ర ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్టేట్ చీఫ్ కొరివి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. నీట్ విధానంతో సౌతిండియా రాష్ట్రాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.
రూ.వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తీవ్ర నష్టమని ఇరిగేషన్ నిపుణులు భిక్షం , లక్ష్మీనారాయణ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఏ పార్టీ నుంచి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉండాలని సూచించారు. సమావేశంలో బోయినపల్లి చంద్రయ్య, సిగిరి శ్రీధర్, బాపురెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.