టెన్నిస్ ​ఆడుతుండగా హార్ట్​స్ట్రోక్ ఎంబీబీఎస్ ​స్టూడెంట్​ మృతి

టెన్నిస్ ​ఆడుతుండగా హార్ట్​స్ట్రోక్ ఎంబీబీఎస్ ​స్టూడెంట్​ మృతి

వికారాబాద్, వెలుగు: కాలేజీ ఆవరణలో టెన్నిస్​ఆడుతుండగా గుండెపోటుతో ఓ ఎంబీబీఎస్​స్టూడెంట్​మృతి చెందింది. హైదరాబాద్​కు చెందిన మేఘన(19) వికారాబాద్​జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్​ఫస్ట్​ఇయర్​చదువుతోంది. కాలేజీ హాస్టల్​లోనే ఉంటోంది. సోమవారం రాత్రి కాలేజీ అయిపోయాక ఫ్రెండ్స్​తో కలిసి టెన్నిస్​ఆడుతుండగా మేఘన ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు, స్నేహితులు ఆమెను చికిత్స కోసం స్థానిక మహావీర్ ఆసుపత్రికి తరలించారు. కండిషన్​సీరియస్​గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా దారిలోనే మేఘన చనిపోయింది. యువతి మృతికి గుండెపోటే కారణమని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.