నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్లు

నేటి నుంచి  ఎంబీబీఎస్ వెబ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న విద్యార్థులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 29న సాయంత్రం 6 గంటలల్లోగా వెబ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. వర్సిటీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ https://tsmedadm.tsche.inలో కాలేజీలు, రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలను అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 5,658 ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌కు వెబ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే, రెండో దశ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడానికి అనర్హులు అవుతారని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనాలనుకుంటే, మొదటి దశ నుంచే వెబ్‌‌‌‌‌‌‌‌ ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో సీటు పొంది, తమకు కేటాయించిన కాలేజీలో చేరకపోతే తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడానికి వారు అనర్హులవుతారని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే 93926 85856, 78421 36688, 90596 72216 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.