మాకూ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి:ఎంబీఎస్సీ కులాలు

మాకూ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి:ఎంబీఎస్సీ కులాలు
  • మంత్రి దామోదరకు 57 ఎంబీఎస్సీ కులాల ప్రతినిధుల విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎంబీఎస్సీలకు ప్రత్యేక డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహకు 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. 57 ఎంబీఎస్సీ కులాలకు కుల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని కోరారు.

శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి దామోదరను సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం, ప్రతినిధులు కలిశారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నమన్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఏ కులానికి నష్టం జరగదన్నారు.