హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ఎడమకాల్వ కింద పంటసాగు చేసిన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. ఆదివారం నిడమనూరు మండలం వేంపాడు గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సమయం లేకపోవడంతో కేసీఆర్నాగార్జునసాగర్ నియోజకవర్గ బస్సు యాత్రను రద్దు చేసినట్లు తెలిపారు.
సోమవారం నల్గొండ పట్టణంలో కేటీఆర్ పర్యటించనున్నట్లు చెప్పారు. కేటీఆర్పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి వెంట నాయకులు కేవీ రామారావు, కట్టెబోయిన గర్వయ్య యాదవ్, ఎంపీపీలు సుమతీపురుషోత్తం, బొల్లం జయమ్మ, విరిగినేని అంజయ్య, బాబూరావునాయక్, నాయకులుతదితరులు ఉన్నారు.