ముంబై : ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. వాంఖడే స్టేడియాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా క్రికెట్ బాల్స్‌తో ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం’ అనే వాక్యాన్ని రూపొందించారు. ఇది అతిపెద్ద క్రికెట్ బాల్ వాక్యంగా గిన్నిస్ రికార్డు బుక్స్‌లో చోటు సంపాదించింది. ఇందుకోసం రంగులతో కూడిన 14 వేల 505 బాల్స్‌ను ఉపయోగించారు. ఎంతో మంది లెజెండ్ ప్లేయర్లకు నిలయంగా మారిన వాంఖడే.. దేశంలోని ఐకానిక్ స్టేడియాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
2011లో ధోనీ సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్ కప్ సాధించిన వేదిక కూడా ఇదే. వైట్, రెడ్‌తో కూడిన క్రికెట్ బాల్స్‌తో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించడం చాలా సంతోషాన్నిచ్చిందని ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్ వెల్లడించారు. 1975 జనవరి 23 నుంచి 29 వరకు ఇండియా, వెస్టిండీస్ మధ్య ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది.